
- 388 మంది బైకర్లే..
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పీఎస్లలిమిట్స్లో శనివారం డ్రంక్అండ్డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇందులో 478 మంది తాగి బండ్లు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరిలో 388 మంది బైకర్లు, 70 మంది కారు డ్రైవర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మియాపూర్పీఎస్ పరిధిలో101 మంది, అత్యల్పంగా రాయదుర్గం, మేడ్చల్ లో 15 మంది దొరికారు. 187 మంది 31 నుంచి 40 ఏండ్ల వయస్సు మధ్య ఉండగా, 172 మంది 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.