స్టేట్​ లెవల్ ​రగ్బీ పోటీలకు 48 మంది సెలెక్ట్

స్టేట్​ లెవల్ ​రగ్బీ పోటీలకు 48 మంది సెలెక్ట్

మెదక్ (చేగుంట), వెలుగు:​ ఖేలో ఇండియా స్టేట్​ లెవల్​రగ్బీ అండర్​14, అండర్​ -18 పోటీలకు 48 మంది సెలెక్ట్ అయినట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. శుక్రవారం చేగుంట పట్టణంలోని మోడల్​స్కూల్​ గ్రౌండ్ లో సెలెక్షన్స్ నిర్వహించగా.. జిల్లా నలుమూలల నుంచి 100 మందికి పైగా ప్లేయర్స్‌ పాల్గొన్నారు. 

అండర్ - 14 బాలికల విభాగంలో గాయత్రి, లాస్య, దివ్య, కావ్య, అక్షయ, రాణి కుమారి, వైష్ణవి, మాధురి, అంకిత, అనురాధ, ప్రియాంక,  నందిని, బీ టీమ్ లో నవనీత, నిహారిక, గోవర్ధిని, నవత, స్వాతి, సుందరి, వర్ష, సోనియా, నందిని, అవంతిక, రేహనా ఎంపికయ్యారు. జూనియర్ అండర్- 18 విభాగంలో శిరీష , జ్యోతి, సుజాత, అనిత, పూజ, దివ్య, నిఖిత, కల్యాణి, శైలజ, పింకీబాయ్, సింధూజ, సీనియర్ మహిళల  విభాగంలో నందిని, బబిత, అఖిల, సంజుల, గీతాంజలి, రజని, జయత, వనజ, మౌనిక, మల్లీశ్వరి సెలెక్ట్ అయ్యారు.   

అండర్ -18, సీనియర్ మహిళల జట్లు 23న, అండర్ - 14 బాలికల జట్లు 24 వ తేదీన  సికింద్రాబాద్ లోని ఆర్ఆర్‌సీ గ్రౌండ్ సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉదయం 6:30 గంటల వరకు రిపోర్ట్ చేయాలని కోచ్ సూచించారు. ఈ సెలక్షన్స్​కు నేషనల్ రగ్బీ రెఫరీ కర్ణం మల్లీశ్వరి, జిల్లా పీఈటిల అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, పీడీలు శారద, వెంకటేష్, మంజుల, నర్సింలు పీఈటీ బాలరాజ్ హాజరయ్యారు.