
- గజం రేటు రూ.1లక్షా 5వేలు
హైదరాబాద్, వెలుగు:రంగారెడ్డి జిల్లా మోకిలా లేఅవుట్లో 50 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేయగా 48 ప్లాట్లు అమ్ముడ య్యాయి. అత్యధికంగా గజం రూ.105,000, అత్యల్పంగా గజం రూ.72000 పలకగా, యావరేజ్‌గా రూ.80397 పలికినట్లు హెచ్ఎండీఏ సోమవారం ప్రకటనలో వెల్లడించింది.
300, 500 గజాలుగా ప్లాట్లను డివైడ్ చేసి మొత్తం 15,800 చదరపు గజాలకు వేలం నిర్వహించింది. ప్లాట్ల అమ్మకం ద్వారా రూ. 39.50 కోట్లు వస్తాయని హెచ్ఎండీఏ అంచనా వేయగా రూ.121.40 కోట్ల ఆదాయం వచ్చింది.
నార్సింగి శేరిలింగంపల్లికి 2 కిలోమీటర్ల సమీపంలో ఉన్న మోకిలా గ్రామంలో హెచ్ఎండీఏ మొత్తం 165 ఎకరాలను డెవలప్ చేసి వేలం నిర్వహిస్తున్నది.