
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 4,818 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 32 జిల్లాలో చలివేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 458, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 8 ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఎండలు ముదిరిన నేపథ్యంలో గ్రామాలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రజలు డబ్బులు చెల్లించి నీళ్లబాటిళ్లు కొనుక్కోకుండా తాగునీటిని ఉచితంగా అందించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ఆదేశాల మేరకే కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. వీటి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీ సిబ్బందికి అప్పగించింది.