న్యూఢిల్లీ: రిలయన్స్ జియో సబ్‌స్క్రయిబర్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి 48.18 కోట్లకు పెరిగారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24 లో జియో కొత్తగా 4.24 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లను యాడ్ చేసుకుంది. మొత్తం యూజర్లలో 10.80 కోట్ల మంది 5జీకి మారారని యాన్యువల్ రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశం మొత్తం మీద ట్రూ5జీ పేరుతో 5జీ సర్వీస్‌లను కంపెనీ అందుబాటులోకి తెస్తోంది.
దేశంలోని 5జీ యూజర్లలో 85 శాతం మంది జియో వాడుతున్నారని కంపెనీ పేర్కొంది. జియోఎయిర్‌ఫైబర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, దేశంలో 12 లక్షల సబ్‌స్క్రయిబర్లను సాధించామని వెల్లడించింది. రూ.వెయ్యి లోపు ఉండే ఫోన్ల మార్కెట్‌లో జియో భారత్ ఫోన్ వాటా 50 శాతానికి పెరిగిందని తెలిపింది.