రంగారెడ్డిలో ఇందిరమ్మ ఇండ్లకు 48,338 దరఖాస్తులు

రంగారెడ్డిలో ఇందిరమ్మ ఇండ్లకు 48,338 దరఖాస్తులు

ఇబ్రహీంపట్నం, వెలుగు : రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మొత్తం 924 గ్రామ, వార్డు సభల్లో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల కు 48,338 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.  ప్రజాపాలన, మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం 1, 53,874 దరఖాస్తులు, గ్రామ సభల ద్వారా 73,390, రైతు భరోసాకు 880, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 4,870 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.