బషీర్ బాగ్, వెలుగు : మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి, మహిళ పేరుతో సైబర్ నేరగాళ్లు సిటీకి చెందిన ఓ వ్యక్తిని చీట్చేశారు. అతని నుంచి రూ.4.9 లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన ఓ ప్రైవేట్ఉద్యోగి(45)తో డైవర్స్ మ్యాట్రిమోనీ యాప్ లో కార్డియాలజిస్ట్ పేరుతో ఓ మహిళ చాట్చేసింది. తర్వాత పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం కొంత డబ్బు పంపించాలని కోరింది. వారం రోజుల్లో తిరిగి ఇస్తాననింది. తర్వాత తన తల్లి చనిపోయిందని మరోసారి డబ్బులు అడిగింది.
ఇలా విడతల వారీగా అతని నుంచి రూ.4,97,000 తీసుకుంది. తర్వాత కాల్చేస్తే రెస్పాన్స్లేకపోవడంతో అతనితో చాట్చేసింది, మాట్లాడింది సైబర్నేరగాళ్లని గ్రహించి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఓ విత్తనాల వ్యాపారి(61)ని చీట్చేసి సైబర్ నేరగాళ్లు రూ.2,64,000 కొట్టేశారు. ఆర్మీ ఆఫీసర్లతో పేరుతో ఆన్లైన్లో వ్యాపారిని పరిచయం చేసుకున్నారు.
తమ వద్ద ఓక్రా విత్తనాలు 20 కిలోలు ఉన్నాయని, వాటి ధర రూ.88వేలు అని ఫొటోలు పంపించారు. తక్కువ ధరకు విత్తనాలు వస్తాయని ఆశపడి వాళ్లు అడిగినంత విడతల వారీగా డబ్బు పంపించాడు. విత్తనాలు డెలివరీ కాకపోవడం, డబ్బు పంపాక స్పందన లేకపోవడంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.