
అచ్చంపేట, వెలుగు : అక్రమంగా నిల్వ ఉంచిన 49 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ హేమ్లానాయక్ తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని వట్టేపు రామస్వామి అక్రమంగా నిలువ ఉంచిన 38 క్వింటాళ్ల బియ్యంతో పాటు వారుగంటి సాయి కుమార్ నిల్వ ఉంచిన 18 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో అచ్చంపేట ఎస్ఐ రాము, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.