
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో 29, నల్గొండ జిల్లాలో 2 చెరువుల డెవలప్కు రాష్ట్ర సర్కారు ఫండ్స్విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట, సంగారెడ్డి మండలాల చెరువులకు రూ.49.8 కోట్లను ఇచ్చింది. కాగా, నల్గొండ జిల్లాలోని గుర్రంపోడులో ఉన్న రాయని చెరువు, ఊర చెరువుల రిపేర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.6.34 లక్షలను విడుదల చేసింది.