అందరూ ఏడాదిలోపు వారే.. దేశంలో నాలుగుకు చేరిన HMPV కేసుల సంఖ్య

అందరూ ఏడాదిలోపు వారే.. దేశంలో నాలుగుకు చేరిన HMPV కేసుల సంఖ్య

హెచ్‌ఎంపీవీ(HMPV) లక్షణాలు దేశం నలుమూలలా బయటపడుతున్నాయి. తాజాగా, కోల్‌కతాలో ఐదున్నర నెలల చిన్నారితో HMPV లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. చిన్నారి బైపాస్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 

చిన్నారి తల్లిదండ్రుల స్వస్థలం ముంబై కాగా, ఇటీవల వారు కోల్‌కతా వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. కోల్‌కతా వచ్చాక చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబీకులు బైపాస్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. అనుమానంతో వైద్యులు వైరల్ PCR పరీక్ష చేయగా.. హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం సదరు చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

బెంగుళూరులో 2, అహ్మదాబాద్ లో ఒకటి

ఇది దేశంలో నాలుగో HMPV కేసు. అంతకుముందు బెంగుళూరులో రెండు, అహ్మదాబాద్ లో ఒక కేసు వెలుగు చూశాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా తేలిన నలుగురూ చిన్న పిల్లలే. ఏడాదిలోపు వారే. 

ALSO READ | HMPV వైరస్ అలర్ట్ : ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరి డేటా తీసుకోండి.. ట్రాక్ చేయండి.. కేంద్రం ఆదేశాలు