క్వీన్స్‌టౌన్: కివీస్ గడ్డపై పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న భారత మహిళల టీమ్ వరుసగా నాలుగో వన్డేలోనూ పరాజయం పాలైంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మిథాలీరాజ్ టీమ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 0-3తో సిరీస్ కోల్పోయిన టీమిండియా.. మంగళవానం జరిగిన మ్యాచ్ లో 63 పరుగుల తేడాతో ఓడింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసింది. వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదించారు. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే కీలక నాలుగు వికెట్లను కోల్పోయింది. 20 పరుగులకే స్మృతిమందాన, షెఫాలీ,భాటియా,పూజ ఔట్ అయ్యారు. కెప్టెన్ మిథాలీ రాజ్, రిచా ఘోష్ కాసేపు మెరిసినా .. మ్యాచ్ అప్పటికే కివీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 17.5 ఓవర్లకు 128/10 కుప్పకూలిన భారత్ కు ఓటమి తప్పలేదు.
New Zealand win the fourth ODI against India by 63 runs ?
— ICC (@ICC) February 22, 2022
The hosts take a 4-0 lead in the five-match series.#NZvIND pic.twitter.com/C41X4Rk1gt