History: అక్కడ అన్నీ సమాధులే.. ఏ కాలం నాటివంటే...

History: అక్కడ అన్నీ సమాధులే.. ఏ కాలం నాటివంటే...

ఒకే ప్రాంతంలో నాలుగు వేల సమాధులు ఉన్నాయి. పైగా రాతి సమాధులు. వాటి వయసు రెండు వేల సంవత్సరాలు పైగానే ఉంటుంది. ఇంతకీ ఇవి ఎక్కడున్నాయి అనేగా? మన దగ్గరే ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. వాటిని బ్రిటీష్ కాలంలోనే గుర్తించినా... పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.మళ్లీ ఇప్పుడు ఏడాదిగా పరిశోధనలు చేస్తున్నారు ఆర్కియాలజిస్ట్లు....

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఆదిమతెగల ఆనవాళ్లు, చెక్కుచెదరని రాతి సమాధులపై ఆర్కియాజిస్టులు పరిశోధనలు చేస్తున్నారు.. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులెవరు? ఇప్పటికీ చెక్కు చెదరని ఆ రాతి సమాధులు ఏ కాలం నాటివి? అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన ప్రాంతమైన పినపాక మండలంలోని పాండురంగాపురం గ్రామంలో ఎన్నో. రాక్షసగూళ్లు ఉన్నాయి. గుప్త నిధులు ఉన్నాయని. వాటిలో కొన్నింటిని తవ్విధ్వంసం చేశారు.

బ్రిటిష్ కాలంలోనే..

ఈ సమాధులను 1881లోనే బ్రిటీషు ప్రభుత్వం గుర్తించింది. కానీ పెద్దగా పరిశోధనలు చేయించలేదు. 1940లో నిజాం రాజ్యంలో  ఆర్కియాలజీ డిపార్ట్​ మెంట్ ఉద్యోగి ఖ్వాజా మహ్మద్ అహ్మద్ వీటిపై పుస్తకాలు కూడా ప్రచురించారు. తర్వాత కాలంలో ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఈ మధ్యే అనగా 2019 లో  పరిశోధనలు  చేశారు. 

ఒకే దగ్గర 4వేల సమాధులు

హైదరాబాద్​ సర్కిల్ లోని ఆర్కియాలజీ సూపరింటెండెంట్ డాక్టర్ మిలాన్ కుమార్ తోపాటు ఆరుగురు సభ్యుల బృందం పాండురంగాపురం రాక్షసగూళ్లపై 2019 లో పరిశోధనలు చేసింది. వాళ్లు ఇక్కడ నాలుగు వేల రాతి సమాధులు ఉన్నట్లు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో రాతి సమాధులను ప్రపంచంలో అప్పటి వరకు ఎక్కడా గుర్తించలేదు. ఇక భారతదేశంలో కూడా ఇవి అరుదైన చారిత్రాత్మక ఆధారాలు అని ఆర్కియాలజిస్టులు అంటున్నారు. ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్​ మెంట్​ తెలంగాణలో ఎనిమిది చరిత్రాత్మక ప్రదేశాలను గుర్తించింది. అందులో పాండురంగాపురం రాక్షసగూళ్లకు కూడా స్థానం దక్కింది.

శిక్షణా కేంద్రంగా

ఆర్కియాలజీ స్టూడెంట్స్ ను ఇక్కడికి తీసుకొచ్చి శిక్షణ ఇస్తున్నారు. రాతి సమాధులను తవ్వి పరిశీలించారు.  దొరికిన ఎముకలను  ఫోరెన్సిక్ ల్యాబ్​ కు పంపించి ఏ కాలం నాటినో పరీక్షించారు. ఈ పరిశోధనల ఆధారంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక నివేదికను తయారు చేసింది. ఆ నివేదిక అంత స్పష్టంగా లేక పోయినప్పటికి.. మొఘలులు కాలానికి సుమారు 500 సంవత్సరాల క్రితం నాటివని పేర్కొన్నారు.  ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గుట్టలు, ములుగు మండలంలోని కాటారం ప్రాంతంలో కూడా ఇలాంటి రాక్షస గూళ్లే ఉన్నట్లుగా ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు.