కానిస్టేబుల్ సాహసం..ఓచిన్నారికి ప్రాణదానం..ఓపక్క బోరునవర్షం..దురదృష్టవశాత్తు పాముకాటుకు గురైన చిన్నారి..అపస్మారక స్థితిలోఉంది..చుట్టూ మనిషి ముని గేంత వరద..ఎటు పోలేని పరిస్థితి..అప్పుడు కానిస్టేబుల్ సాహసించాడు..దాదాపు ఐదున్నర అడుగుల వరద ప్రవాహంలో ఐదున్నర కిలోమీటర్లు.. సాహసోపే తంగా చిన్నారిని ఆస్పత్రికి చేర్చిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
కురవి మండలం రాజోలు గ్రామంలో బాలు తండాకు చెందిన విషిక (4) పాముకాటుకు గురైంది.. భారీవర్షాలతో తండా చుట్టూ వరద నీరు చేరింది..దాదాపు ఐదున్నర అడుగుల లోతు నీరు నిలవడంతో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి..అప్పుడే ట్రాఫిక్ కానిస్టేబుల్ భాస్కర్.. చిన్నారిని భుజాలపై వేసుకొని నీటిలో ఈదుకుంటూ ఆస్పత్రికి చేర్చారు.గంట తర్వాత గాని చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు.. చిన్నారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు..
ALSO READ | యువ సైంటిస్టును బలి తీసుకున్న ఆకేరు వాగు
కానిస్టేబుల్ సాహసం తమ బిడ్డ ప్రాణాలు కాపాడింది.. సమయానికి దేవుడిలా కానిస్టేబుల్ భాస్కర్ వచ్చాడు.. ఆయనే రాకపోయి వుంటే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవి కా వని..చిన్నారి తల్లిదండ్రులు కానిస్టేబుల్ భాస్కర్ కు సెల్యూట్ చేశారు. కృతజ్ణతలు తెలిపారు.. ట్రాఫిక్ కానిస్టేబుల్ భాస్కర్ సాహసాన్ని అందరూ అభినందించారు.