హోటల్‌‌ వర్కర్​పై గ్యాంగ్ రేప్

హోటల్‌‌ వర్కర్​పై గ్యాంగ్ రేప్

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లో  దారుణం జరిగింది. ఆగ్రాలోని ఓ హోటల్‌‌లో పనిచేస్తున్న యువతికి మద్యం తాగించి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్రా ఏసీపీ అర్చనా సింగ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళపై అత్యాచారం, దాడి జరిగినట్లు శనివారం రాత్రి తాజ్‌‌గంజ్‌‌ పోలీసులకు కాల్‌‌ వచ్చింది. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని కాపాడారు. 

నిందితులు తనను అభ్యంతరకరమైన రీతిలో వీడియో తీశారని బాధిత యువతి పోలీసులకు చెప్పింది. దాని ద్వారా వారు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. బలవంతంగా తనను ఓ హోంస్టేకి తీసుకెళ్లి మద్యం తాగించారని, గాజు సీసాతో తలపై కొట్టారని పోలీసుల ముందు వాపోయింది.

ALSO READ :  ‘మహాదేవ్’ స్కామ్‌‌లో కింగ్‌‌ పిన్ బాఘెల్ 

అనంతరం నలుగురు యువకులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నలుగురు యువకులు, ఒక మహిళను అరెస్టు చేశారు. నిందితులంతా ఆగ్రాకు చెందిన వారేనని ఏసీపీ తెలిపారు. వారిపై రేప్ సహా పలు సెక్షన్ల కింద కేసులు బుక్‌‌ చేసినట్లు వెల్లడించారు.