5 ఆస్టరాయిడ్స్ భూమివైపు దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. ఇందులో ఒకటి ఓ పెద్ద ఇల్లు అంత సైజులోనూ.. మరో రెండు విమానం సైజులో భూమివైపు రావడానికి సిద్ధంగా ఉన్నాయని నాసా తెలిపింది. సెప్టెంబర్ 6 నుంచి 12 తేదీల మధ్య ఒక ఇంటి పరిమాణంలో ఒక గ్రహశకలం, విమానం పరిమాణంలో మూడు, బస్సు పరిమాణంలో ఒక గ్రహశకలం భూమికి దగ్గరగా జూమ్ అవుతాయని నాసా తెలిపింది.
నాసా తెలిపిన వివరాల ప్రకారం.. JA5 అని పిలువబడే గ్రహ శకలం సెప్టెంబర్ 6న భూగ్రహం గుండా వెళ్లిందని.. అది భూమిగుండా 3.17 మిలియన్ మైళ్లు ప్రయాణించిందని ప్రకటించింది. ఇలాంటి గ్రహశకలాలను మొదటిసారి 2021లో పరిశీలించామని తెలిపింది. గ్రహ శకలం పరిమాణం దాదాపు 59 అడుగులు ఉంటుందని నాసా తెలిపింది.
2023, సెప్టెంబర్ 8 న మరో రెండు గ్రహశకలాలు భూమిని దాటాయి. వీటి సైజు 73 అడుగులు. మరో బస్సు పరిమాణంలో ఉన్న 26 అడుగుల గ్రహశకలం కూడా భూమి గుండా వెళ్లింది.
2023, సెప్టెంబర్ 10న 68 అడుగుల పరిమాణంలో ఉన్న రెండో గ్రహశకలాలు భూమిని దాటునున్నాయి. ఈ గ్రహ శకలం భూమికి దాదాపు 1.65మిలియన్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తూ గ్రహానికి అత్యంత దగ్గరగా రానుందని నాసా తెలిపింది.
2023, సెప్టెంబరు 12న భూమి మీదుగా ప్రయాణించే ఐదవ గ్రహశకలం కూడా బస్సు పరిమాణంలో ఉంటుంది. 25 అడుగుల పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం.. ఇది భూమికి 2.6 మిలియన్ మైళ్ల దూరంలో ఉందని నాసా తెలిపింది.
నాసా డాష్ బోర్డు భూమికి దగ్గరగా ఉంటే గ్రహశకలాలు, తోక చుక్కలను ట్రాక్ చేస్తుంది. గ్రహశకలాల వ్యాసం, పరిమాణం, భూమినుంచి దూరం, తేదీని ప్రదర్శిస్తుంది. ఇది 7.5 మిలియన్ కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రహశకలాలను ట్రాక్ చేస్తుంది.
ఇప్పటివరకు నాసా డాష్ బోర్డు కిలోమీటర్ వెడల్పు ఉన్న 850 గ్రహ శకలాలతో సహా దాదాపు 30 వేల గ్రహశకలాలను భూమికి సమీపంలో గుర్తించింది. వాటికి నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అని పేరు పెట్టారు. వీటినుంచి మరో వందేళ్ల వరకు భూమికి ఎటువంటి హాని ఉండదు.