
హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ ( ఏప్రిల్ 30) చాలా ప్రాముఖ్యమైన రోజు. జైనులు కూడా ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అక్షయ ...అంటే ఎప్పటికీ తగ్గనిది అని అర్థం. అందుకే ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించినా.. కొత్త వస్తువులు కొన్నా ఆర్థికంగా.. ఎంతో అభివృద్ది ఉంటుందని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ కొన్ని వస్తువులు కొనాలని చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ..
బంగారం మరియు వెండి: అక్షయ తృతీయ నాడు బంగారం లేదా వెండి కొనడం అనేది సంప్రదాయంగా వస్తుంది. బంగారం ...సంపద శ్రేయస్సును సూచిస్తుంది. వెండి స్వచ్ఛత ... ఆశీర్వాదాలను సూచిస్తుంది. వీటిపై ఆరోజు పెట్టుబడి పెట్టడం వలన ఆభరణాలు, నాణేలు లేదా అంతులేని సంపద లభిస్తుందని నమ్ముతారు.
వాహనాలు: అక్షయ తృతీయ రోజున కారు ... ద్విచక్ర వాహనం కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తిగత .. ఆర్థిక వృద్ధికి సంకేతంగా పరిగణించబడుతుంది. కొన్ని కంపెనీలు అక్షయ తృతీయ రోజున డిస్కౌంట్లను కూడాప్రకటిస్తాయి.
స్థిరాస్తి: అక్షయ తృతీయ రోజు భూమిపై పెట్టుబడి పెట్టడానికి అనువైన రోజుగా భావిస్తారు. ఈ రోజు కొన్న ఆస్తి అభివృద్ది చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి.
వంటగది సామాను.. ఫర్నిచర్: వెండి, రాగి లేదా ఉక్కుతో చేసిన పాత్రలను కొనడం వల్ల అదృష్టం వస్తుందని నమ్ముతారు. ఈ రోజున వంటగది సామాను.. సోఫా .. డైనింగ్ టేబుల్ .. గృహోపయోగ వస్తువులు కొంటే ఇంటి శ్రేయస్సును కలుగజేస్తాయి.
స్టాక్స్ .. మ్యూచువల్ ఫండ్స్: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు అక్షయ తృతీయ నాడు SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్రారంభిస్తే పెట్టుబడులు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | ఆధ్యాత్మికం : డబ్బు..సంపద ఉంటేనే గౌరవం.. సన్మానాలు