హైదరాబాద్: పాతబస్తీ చాదర్ ఘాట్లో మలక్ పేట మెట్రో రైలు స్టేషన్ కింద రెండు రోజుల క్రితం జరిగిన వాహనాల దగ్ధం కేసును చాదర్ ఘాట్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం మలక్ పేట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ 5 ద్విచక్ర వాహనాలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చాదర్ ఘాట్ పోలీసులు, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మలక్ పేట ఏసీపీ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో చాదర్ ఘాట్ సీఐ రాజు రెండు టీమ్లుగా ఏర్పడి.. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ను క్లుప్తంగా పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని జకీర్ అలియాస్ బంటాగా నిర్ధారించారు. జకీర్ ఇంటిపై పోలీసులు ఏక కాలంలో దాడులు చేశారు. గతంలోనూ పలు వాహనాలు దగ్ధం చేసినట్లు నిందితుడు జకీర్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ALSO READ | కాళ్లు పట్టుకున్నా కనికరించలే..వీల్ ఛైర్లో ఉన్న మామను చితకబాదిన కోడలు
మలక్ పేట మెట్రో స్టేషన్ కింద పార్క్చేసిన ఐదు బైకులు కాలిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం మెట్రో స్టేషన్కింద నిలిపిన ఓ బైక్ నుంచి మంటలు చెలరేగి పక్క బైకులకు అంటుకున్నాయి. క్షణాల్లో ఐదు బైకులు దగ్ధమయ్యాయి. కాలిపోతున్న బైకులను చూసి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మెట్రో సిబ్బంది సమాచారంతో మూడు ఫైరింజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.