మనం సాధారణంగా బైక్ ను కొనుగోలు చేసే ముందు దాని మైలేజీపై ఖచ్చితంగా వివరాలను తెలుసుకుంటాం. పెద్దగా ఖర్చులేని, మంచి మైలేజీనిచ్చే అలాంటి బైక్ ని ప్రజలు ఇష్టపడుతున్నారు. దీనర్థం ప్రతిరోజూ మనకు ఉపయోగపడే బైక్ ఖర్చు తగ్గించేదిగా ఉండాలని చూస్తాం. మీరు మైలేజీ ఇచ్చే బైక్ కోసం చేస్తున్నట్లయితే 5 బైక్ మోడళ్ల గురించి తెలుసుకుందాం.
హీరో స్పెండర్ ప్లస్: హీరో స్ల్పెండర్ ప్లస్ ప్రస్తుతం దేశంలో అత్యంత ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మోటార్ బైక్. ఈ బైక్ చాలా కాలం మన్నికతో ఉంటుంది. స్ల్పెండర్ ప్లస్ ఇంధన సామర్థ్యం కూడా చాలా అద్భుతమైంది. హీరో స్ల్పెండర్ ప్లస్ ఇంధన సామర్థ్యం 97.2 సిసి. ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 7.91 bhp శక్తిని, 8.05Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. లీటరుకు 75-80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
బజాజ్ ప్లాటినా: బజాజ్ ప్లాటినా 100 బైక్ అత్యధిక మైలేజీ ఇస్తున్న బైక్.. మైలేజీ పరంగా ఎక్కువగా అమ్ముడవుతున్న మోటార్ బైక్. ఈ మోటార్ బైక్ హీరో స్ల్పెండర్ బైక్ అంత కాకపోయినా.. ఇంధన సామర్థ్యం పరంగా దీనికి ఎదురు లేదు. బజాజ్ ప్లాటీనా 100 7.79bhp పవర్, 8.30Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 102సిసి ఇంజిన్ సామర్థ్యం, ఎయిర్ కూల్డ్ , సింగిల్ సిలిండర్ ఇంజన్ తో వస్తుంది. స్ల్పెండర్ ప్లస్ మాదిరిగానే బజాజ్ ప్లాటినా కూ 4 స్ట్రోక్ స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది. బజాజ్ ప్లాటినా 70 కి.మీ లకంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.
TVS Radeon: 100 సిసి బైకులు బాగా అమ్ముడవుతున్నాయి. వీటి ఉత్పత్తిలో ఆటోమోబైల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అలాంటి 100 సిసి మోటార్ బైక్ విభాగంలో సరికొత్త బైక్ TVS Radeon. ఈ బైక్ అద్భుతమైన నాణ్యత, అద్బుతమైన ఇంజిన్ పనితీరును కలిగి ఉంటుంది. TVS Radeon ఇంజిన్ సామర్థ్యం 109.7 సిసి, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 7.7bhp పవర్, 8.30Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ బైక్ 4 స్ట్రోక్ స్పీడ్ గేర్ బాక్స్ తో లీటర్ కు 69 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది.
హోండా షైన్: హోండా షైన్ 100 కమ్యూటర్ సెగ్మెంట్ లో సరికొత్త బైక్. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందిన బైక్. హోండా షైన్ 100లో 98.98 సిసి సామర్థ్యం, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.28bhp పవర్, 8.05Nm టార్క్ ను ఇస్తుంది. ఈ మోటార్ సైకిల్ లో 4 స్ట్రోక్ స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. ఈ బైక్ లీటరుకు 65 కి.మీ. కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది.
హోండా షైన్ 125: ఎలాంటి పరిచయం అవసరం లేని బైక్ హోండా షైన్ 125. ఈ మోటార్ సైకిల్ ప్రస్తుతం భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న 125 సిసి మోటార్ సైకిల్. ఇటీవల దేశంలో 3 మిలియన్ల విక్రయాల మార్క్ దాటింది. హోండా షైన్ 125 123.9 సిసి ఇంజిన్ సామర్థ్యం, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. 10.59 bhp పవర్, 11Nm టార్క్ ఇస్తుంది. ఈ మోటార్ సైకిల్ లో 5 స్ట్రోక్ స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. హోండా షైన్ 125 బైక్ 55-60 మధ్య మైలేజిని ఇస్తుంది.