
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్దాయి. మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ 240, కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించాయి. అదే సమయంలో పలువురు అభ్యర్థులు రికార్డు ఓట్ల తేడాతో విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు ఎవరో చూద్దాం.
- ఇండోర్ లో బీజేపీకి చెందిన శంకర్ లాల్వానీ 11.72 లక్షల ఓట్ల తేడాతో గెలిచి అగ్రస్థానంలో నిలిచారు.
- అస్సాంలోని ధుబ్రీ నుంచి కాంగ్రెస్‌కు చెందిన రకీబుల్ హుస్సేన్ 10 లక్షల 12 వేలతో గెలిచి రెండో స్థానంలో నిలిచారు
- మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిషా నుండి 8.21 లక్షల ఓట్లతో గెలుపొందారు . ఇదే మూడవ అత్యధిక ఆధిక్యం కావడం విశేషం.
- గుజరాత్‌లోని నవ్సారి నుండి - బీజేపీ నేత సిఆర్ పాటిల్ 7.73 లక్షల ఆధిక్యంతో గెలిచారు.
- గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా 7.44 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.
- కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి 5 లక్షల40 వేల ఓట్లతో గెలుపొందారు.
- త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ త్రిపుర పశ్చిమ నుంచి 6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందగా, త్రిపుర తూర్పు నియోజకవర్గం నుంచి త్రిపుర పార్టీకి చెందిన కృతి దేవ్ దెబ్బర్మన్ 4.86 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు.
- ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి మహేశ్ శర్మ 5.59 లక్షల ఓట్లతో గెలుపొందగా, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి బ్రిజ్మోహన్ అగర్వాల్ 5.75 లక్షల ఆధిక్యంతో గెలుపొందారు.