ఆన్ లైన్ బ్యాంకింగ్ వచ్చాక.. మనం సాధారణంగా బ్యాంకులకు వెళ్లి విత్ డ్రాలు, డిపాజిట్లు చేయడం, ఖాతాలు ఓపెన్ చేయడం వంటి సాంప్రదాయ పనులకు స్వస్తి చెప్పాం.. అంతేకాదు. ఆన్ లైన్ బ్యాంకింగ్ సౌకర్యం వచ్చాక.. ప్రజలు ఇంటి వద్ద నుంచే వారి బ్యాంకులను సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఇది స్మార్ట్ ఫోన్ సాయంతో బిల్లులు చెల్లించడం, మీ ఖాతా బ్యాలెన్స్ చూసుకోవడం, డబ్బును బదిలీ చేయడం వంటి అన్ని రకాల సౌకర్యాలను పొందుతున్నారు. అయితే ఆన్ లైన్ బ్యాంకింగ్ చేస్తున్న సమయంలో అనేక సైబర్ నేరగాళ్లు చిక్కే ప్రమాదం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆన్ లైన్ స్కామర్లు వినియోగదారుని మోసగించడానికి, వారి ఖాతాలను యాక్సెస్ చేసేందుకు కొత్త కొత్త మార్గాలను కనుగొంటున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే స్కామర్లు బారిన పడక తప్పదు. ఆన్ లైన్ బ్యాంకింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆన్ లైన్ మోసాలను కొంత వరకు అరికట్టవచ్చంటున్నారు నిపుణులు.
మీరు తెలుసుకోవలసిన ఆన్‌లైన్ స్కామ్‌లు :
బ్యాంకింగ్ మోసాలు: సైబర్ నేరగాళ్లకు అత్యంత అనుకూలమైన స్కామ్ లలో బ్యాంకింగ్ మోసం ఒకటి. ఎందుకంటే హ్యాకర్లు మీ బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి సులభంగా బోల్తా కొట్టించేందుకు అనేక మార్గాలను స్కామర్లు వినియోగించవచ్చు. చాలా స్కామ్ లు మీ ఖాతా వివరాలను వారికి ఇవ్వడం ద్వారా వారు మిమ్మల్ని ఈజీగా మోసం చేయడం జరగుతుంది.
ఫిషింగ్ : ఫిషింగ్ అంటే హ్యాకర్లు వినియోగదారులకు తప్పుడు సందేశాలు పంపడం ద్వారా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకమైన ఆన్ లైన్ స్కామ్ బ్యాంక్ పంపిన దాని లాగే మీకు టెక్ట్స్ మేసేజ్ లు పంపడం, ఈ మెయిల్ పంపడానికి స్కామర్లకు ఉపయోగపడుతుంది.
ఉదా: మీ ఖాతా యాక్టివ్ ఉండాలంటే ఈ సమాచారాన్ని నిర్ధారించండి అని అలెర్ట్ మేసేజ్ లు పంపడం.
కొన్ని సార్లు హ్యాకర్లు పంపిన ఈమెయిల్, నెంబర్ అందుబాటులో ఉన్న నకిలీ కస్టమర్ సర్వీస్ కు కాల్ చేయమని మిమ్మల్ని అడుతుతుంది.
ఇటువంటి వారికి మీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ (SSN) లేదా మీ పుట్టిన తేదీ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు.
ఐడెంటిటీ చోరీ : ఆన్ లైన్ మోసగాళ్లు వాడే మరో ట్రిక్ ఏంటంటే.. మీ పాస్ వర్డ్ దొంగిలించడం.. లేదా ఊహించడం ద్వారా మీ బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేస్తారు. హ్యాకర్లు మీ ఖాతాలను లాగిన్ చేయగలిగితే సున్నితమైన సమాచారాన్ని దొంగిలించవచ్చు. మీ వివరాలతో క్రిడిట్ కార్డు ఖాతాలను తెరవవచ్చు. షాపింగ్ చేయొచ్చు.. లేదా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును బదిలీ చేయొచ్చు.
సైబర్ నేరగాళ్లు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి సెకనుకు బిలియన్ల కొద్ది పాస్ వర్డ్ లను ఊహించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అందుకే పాస్ వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు అక్షరాలు, సంఖ్యల కలయికతో పొడవైన పాస్ వర్డ్ లను ఎంచుకోవాలి.
కంప్యూటర్ వైరస్ ద్వారా స్కామ్: ఈ స్కామ్ మెయిల్స్ తో అటాచ్ మెంట్ ను కలిగి వుంటుంది.ఇందులో మోసపూరిత యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ఉండొచ్చు. మీరు డౌన్ లోడ్ చేసినట్లయితే అది మీ కంప్యూటర్ కు మాల్వేర్ అటాక్ కావొచ్చు. మెయిల్ ద్వారా లింక్ చేయబడిన మాల్వేర్ మీ కంప్యూటర్ ను హ్యాక్ చేసి డేటాను దొంగిలిస్తుంది. బ్యాంక్, ఇతర ఆర్థిక సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు ఉపయోగించబడుతుంది.
పబ్లిక్ WiFi నెట్వర్క్ లు: పాస్ వర్డ్ లేని ఓపెన్ నెట్ వర్క్ లో ప్రైవేట్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నట్లయితే వినియోగదారుల డివైజ్ ను హ్యాక్ చేయడం చాలా సులభం.పబ్లిక్ WiFi ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి హ్యాకర్లకు చాలా సులభం. రెస్టారెంట్లు, డిపార్ట్ మెంట్ స్టోర్లు, విమానాశ్రయాల్లో ఇంటర్నెట్ ఉపయోగిస్తే.. వారు తమ డివైజ్ ను హ్యాకర్లకు సులభంగా యాక్సెస్ ఇచ్చినట్లే.. అందుకే పబ్లిక్ వైఫై వాడే ముందు జాగ్రత్త వహించాలి.
పబ్లిక్ వైఫై వినియోగించి మీ బ్యాంక్ ఖాతాను ఆన్ లైన్ లో తెరిచినట్లయితే మీకు తెలియకుండానే మీ వివరాలు బహిర్గతమవుతాయి. పబ్లిక్ వైఫై సాయంతో ఆన్ లైన్ షాపింగ్ చేస్తే..మీ క్రిడిట్ కార్డు సమాచారం కూడా తెలిసిపోవచ్చు. మీ బ్యాంకు ఖాతా మోసాలకు గురయ్యే అవకాశం ఉంది.
మీ డివైజ్ లు హ్యాక్ కాకుండా సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకునేందుకు 7 టిప్స్:
- ధృవీకరించబడిన యాప్ లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అధీకృత వెబ్ సైట్ లను మాత్రమే సందర్శించారు. కొన్ని వెబ్ సైట్లలో ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసినప్పుడు మోసం జరిగే అవకాశం ఉంది. వెబ్ సైట్ సురక్షితమా కాదా అని తెలుసుకోవాలంటే లాక్ చిహ్నం ఉందా లేదా చూడాలి.
- సురక్షితమై నెట్ వర్క్ ను వినియోగించాలి. పబ్లిక్ వైఫై ఎంపిక మంచిది కాదు.
- మీ డెబిట్, క్రిడిట్ కార్డులు వినియోగించే ముందు అప్రమత్తంగా ఉండాలి. POS మెషీన్లు వినియోగించేముందు చెక్ చేసుకోవాలి.
- మీ ఫోన్లు, కంప్యూటర్లలో తప్పనిసరిగా సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ఉపయోగించాలి. ఇది మీ డివైజ్ హ్యాక్ కాకుండా కాపాడుతుంది.
- మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలియనివారికి ఎప్పుడూ షేర్ చేయొద్దు
- మీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల లో ఇంటర్నెట్ వినియోగించేటప్పుడు అనుమానాస్పద లింక్ లపై ఎప్పుడూ క్లిక్ చేయొద్దు.