వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడిక్కడే ఐదుగురు మృతి

వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద ఇవాళ తెల్లవారు జామున కారును ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జనుజ్జ కావడంతో  అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాళేశ్వరం నుంచి వరంగల్ వైపు వెల్తున్న ఇసుక లారీ,  ములుగు వైపు వెళ్తున్న కారును  పసరగొండ క్రాస్ రోడ్ వద్ద ఢీ కొట్టింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పరకాల ఏసీపీ శ్రీనివాస్  సహాయక చర్యలు చేపట్టారు.

మృతులు ఐదుగురు వరంగల్ పోచమ్మ మైదానంకు చెందిన మేకల ప్రవీణ్ S/o ప్రభాకర్, మేకల రాకేశ్ s/o ప్రభాకర్, మేడి పవన్ S/o సారయ్య , రోహిత్- హన్మకొండ నయూంనగర్ రంగ్ బార్ గల్లీ, రహీం- (నర్సంపేట ) ప్రస్తుతం వరంగల్ ఆటోనగర్ లో నివాసం ఉంటున్నట్లుగా గుర్తించారు. వీరంతా  22 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు గల వారే.