అయిజ, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామ సమీపంలో ఉన్న నెట్టెంపాడు కాలువలో సోమవారం 5 అడుగుల కొర్రమీను చేప కనిపించింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతు బోయ హనుమంతు చేపను గుర్తించాడు.
నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో కాలువలోకి దిగి చేపను పట్టుకున్నాడు. దాదాపు 10 కేజీల బరువు ఉండగా, విషయం తెలుసుకున్న పక్క రైతులు అక్కడికి చేరుకొని చేపను ఆసక్తిగా చూశారు. గట్టు మండలం ముచ్చోనిపల్లి రిజర్వాయర్ నుంచి పెద్ద సంఖ్యలో కాలువ వెంట చేపలు వస్తున్నాయని రైతులు తెలిపారు.-