
కరోనా లాక్‌డౌన్ సమయంలో కంప్యూటర్ కోడింగ్‌కు సంబంధించిన టెక్నికల్ కోర్సులు నేర్చుకోవాలనుకునే యువతకు బెస్ట్ చాన్స్ ఇది. ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోడింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోడింగ్‌లో బేసిక్ సీ లాంగ్వేజ్ మొదలు జావా స్క్రిప్ట్, పైథాన్ వంటి కోర్సుల వరకు నేర్పుతోంది. అలాగే మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడం కూడా ఆన్‌లైన్‌లో ఫ్రీగా నేర్చుకునే అవకాశం ఇస్తోంది. ఐడు కోడింగ్ కోర్సులను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులను ఆన్‌లైన్‌లో ఫ్రీగా నేర్చుకోవచ్చు. అయితే హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ కావాలని కోరుకుంటే మాత్రం కొంతమేర సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాలు:
1. Introduction to computer science
కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్‌ను ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. 11 వారాల పాటు ఈ కోర్సు ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయి. వారానికి 10 నుంచి 20 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. సీ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్, సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ వంటివి నేర్చుకోవచ్చు. వీటికి సర్టిఫికేట్ కావాలనుకుంటే 90 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కోర్సులో ఎన్‌రోల్ చేసుకునేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి: Introduction to computer science
2. Web Programming with Python and JavaScript
పైథాన్, జావా స్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్ వంటివి ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. 12 వారాల పాటు క్లాసులు జరుగుతాయి. వారానికి ఆరు నుంచి తొమ్మిది గంటల పాటు క్లాసులు జరుగుతాయి. ఈ కోర్సు సర్టిఫికేట్ కోసం 149 డాలర్లు కట్టాల్సి ఉంటుంది.
ఈ కోర్సులో ఎన్‌రోల్ చేసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి: Web Programming with Python and JavaScript
3. Introduction to game development
కంప్యూటర్ లాంగ్వేజ్ C#తో పాటు, 2డీ, 3డీ గ్రాఫిక్స్, యానిమేషన్ ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. మొత్తం 12 వారాల పాటు, వారానికి 6-9 గంటల చొప్పున క్లాసులు జరుగుతాయి. ఈ కోర్సు సర్టిఫికేట్ కావాలంటే 149 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కోర్సు పూర్తి వివరాలు, ఎన్‌రోల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి: Introduction to game development
4. Mobile app development
మొబైల్ యాప్స్ డెవలప్ చేయాలన్న ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. జావా స్క్రిప్ట్, ES6, రియాక్ట్, JSX వంటివాటి ద్వారా మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం ఎలా అన్నది ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. మొత్తం 13 వారాల్లో ఈ కోర్సు నేర్పుతారు. వారానికి 6-9 గంటల చొప్పున క్లాసులు జరుగుతాయి. దీనికి సంబంధించి సర్టిఫికేట్ పొందేందుకు 90 డాలర్లు చెల్లించాలి.
ఈ కోర్సు పూర్తి వివరాలు, ఎన్‌రోల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి: Mobile app development
5. Introduction to Artificial Intelligence with Python
మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ ప్రిన్సిపుల్స్‌తో పాటు పైథాన్‌లో ప్రోగ్రాంలో AI ఎలా వాడాలన్నదానిపై ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. ఏడు వారాల పాటు జరిగే ఈ కోర్సులో వారానికి 10-30 గంటల చొప్పున క్లాసులు ఉంటాయి. ఈ కోర్సుకు సర్టిఫికేట్ పొందాలంటే 199 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కోర్సు పూర్తి వివరాలు, ఎన్‌రోల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి: Introduction to Artificial Intelligence with Python