మూత్రపిండాలను శుభ్రపరిచి, ఆరోగ్యంగా ఉంచే 5 రకాల పండ్లు

మూత్రపిండాలను శుభ్రపరిచి, ఆరోగ్యంగా ఉంచే 5 రకాల పండ్లు

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా.. మీ కిడ్నీల ఆరోగ్యం కోరుకుంటున్నారా.. ఆస్పత్రికి వెళ్లకుండా కిడ్నీలను ఎలా ఆరోగ్యం ఉంచుకునేందుకు ఈ ఐదు రకాల పండ్లు మనం రోజు తినే ఆహారంలో తీసుకుంటే కిడ్నీలు  ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని..  కిడ్నీల సమస్యలతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు వైద్యులు. ఆ ఐదు రకాల పండ్లు ఏమిటో తెలుసుకుందాం.  

క్రాన్ బెరీస్:

యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోయాంతోసైనడిన్స్ క్రాన్ బెరీస్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ ఇన్ ఫెక్షన్ నివారణలో సహాయపడతాయి. మొత్తం మూత్ర పిండాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. 

నిమ్మకాయలు: 

విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల నిమ్మకాయలు మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తాయి. మూత్ర నాళాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. 

పుచ్చకాయ: 

అధిక నీటి కంటెంట్ తో పుచ్చకాయ టాక్సిన్స్ ను బయటికి పంపడంలో సహాయపడతాయి. మూత్ర పిండాలను హైడ్రేట్ గా ఉంచుతాయి. 

యాపిల్స్:

ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ యాపిల్స్ లో  పుష్కలంగా ఉంటాయి.  యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడం, నిర్వీశీకరణను ప్రోత్సహించడం ద్వారా మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. 

దానిమ్మ:

యాంటీ ఇన్ ఫ్లామెటరీ లక్షణాలు దానిమ్మ లో పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలు మూత్రపిండాలను శుభ్రపరిచేందుకు వాటి పనితీరును మెరుగు పర్చేందుకు తోడ్పడతాయి.