మూసీ నదికి పోటెత్తిన వరద.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మూసీనదికి వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 

నీటి మట్టం పెరగడంతో ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నది ఇన్​ఫ్లో 3 వేల 680 క్యూసెక్కులుగా ఉండగా.. అదే స్థాయిలో నీటిని బయటకి వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 643 అడుగులు కాగా రెండు అడుగులు ఎక్కువగానే నీటి మట్టం ఉంది.