జూరాలకు మళ్లీ వరద.. 5 గేట్లు ఓపెన్

జూరాలకు మళ్లీ వరద.. 5 గేట్లు ఓపెన్

జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రారంభమైంది. దీంతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు ఐదు గేట్లు ఓపెన్ చేశారు. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్​లలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉండడంతో అక్కడి ప్రాజెక్టులకు వచ్చిన వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ డ్యామ్​ నుంచి 22,240 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 28 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. బీమా నదిపై ఉన్న సనత్ బ్యారేజీ నుంచి 10 వేల క్యూసెక్కుల వరద జూరాలకు వస్తోంది. జూరాల ప్రాజెక్టులో 5,517 టీఎంసీలను నిల్వ ఉంచుకొని 63,650 క్యూసెక్కులను వదులుతున్నారు. 50,500 క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా వస్తోంది.