కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి నట్టికలో రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారిపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. గాయపడ్డ పలువురిని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. లారీలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతులు పాలక్కాడ్ గోవిందపురం స్థానికులు కాళీయప్పన్ (50), నాగమ్మ (39), బంగాజి (20), జీవన్ (4), విశ్వ (1) గా గుర్తించారు.
కలపతో కన్నూర్ నుంచి కొచ్చికి వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కన్నూరుకు చెందిన డ్రైవర్ అలెక్స్ (33), లారీ క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో క్లీనర్ మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పారు.
Also Read:-హైదరాబాద్ లో ఎరుపెక్కిన రోడ్డు.. భయం గుప్పిట్లో జనం
జాతీయ రహదారి పక్కన నిద్రిస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో మృతదేహాలు నుజ్జనుజ్జ అయ్యాయి. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారు. పనుల కారణంగా ఈ ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్లేందుకు వీలులేదు. లారీ డ్రైవర్ డైవర్షన్ బోర్డును పట్టించుకోకుండా నిద్రిస్తున్న వ్యక్తులపైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.