కెనడాలో యాక్సిడెంట్.. ఐదుగురు ఇండియన్ స్టూడెంట్స్ మృతి

కెనడాలో యాక్సిడెంట్.. ఐదుగురు ఇండియన్ స్టూడెంట్స్ మృతి

కెనడాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు చనిపోయారు. టొరంటో సమీపంలో హైవేపై జరిగిన యాక్సిడెంట్ లో ఐదుగురు చనిపోయినట్లు కెనడాలోని భారత హై కమిషనర్ అజయ్ బిసారియా వెల్లడించారు. విద్యార్థుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బాధితుల స్నేహితులను సంప్రదించి అన్ని విధాలుగా సాయం అందిస్తున్నామన్నారు. మార్చి 13న జరిగిన ఈ యాక్సిడెంట్ లో మరో ఇద్దరు విద్యార్థులు గాయాల పాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అజయ్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

సోనియా రాజీనామా చేయాల్సిన అవసరంలేదు

చైనాను ఆయుధ సాయం కోరిన రష్యా!

మణిపూర్ సీఎం ఎంపికపై తర్జనభర్జన