బోధన్, వెలుగు: పట్టణంలోని గవర్నమెంట్ డీగ్రీ కాలేజీ ఆవరణలో క్లోరోహైడ్రెట్ను ఎక్సైజ్ సీఐ రూప్సింగ్ పట్టుకున్నారు. తమకు అందిన సమాచారంతో క్లోరోహైడ్రెట్ను సరఫరా చేస్తున్నా బోధన్ మండలం బర్దిపూర్కు చెందిన గున్నాల జగదీశ్‌గౌడ్, రాకాసిపేట్ కు చెందిన శేకవార్ శంకర్‌గౌడ్, ఎడపల్లి మండలం కుర్నాపల్లికి చెందిన నిమ్మపల్లి నగేశ్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.
Also Read : గుడ్ న్యూస్ : రైతులకు మరో రూ.2 వేలు ఇవ్వటానికి మోదీ సర్కార్ ప్రయత్నాలు
వారి వద్ద నుంచి 5 కిలోల క్లోరోహైడ్రెట్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ రూ.25వేల విలువ ఉంటుందని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ఎస్సై బాలయ్య, కానిస్టేబుళ్లు చంద్రశేకర్, శ్రీనివాస్, ప్రమోద్, సంజీవ్ ఉన్నారు.