
పాల్వంచ, వెలుగు : పట్టణంలోని నవభారత్ వద్ద బైక్పై ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఖమ్మం ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ సుంకరి రమేశ్ఆధ్వర్యంలో సోమవారం పట్టుకున్నా రు. వారి నుంచి 5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసు కొని సాయి తేజ, కె వివేక్ రెడ్డి ని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ గంజాయి విలువ 2 లక్షలు ఉంటుందని సీఐ రమేశ్తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకటేశ్ , విజయ్, హనుమంతరావు, ఉపేందర్ పాల్గొన్నా రు.