గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, దేవ్ ఢీ, ఉడ్తా పంజాబ్ వంటి వినూత్న కథా చిత్రాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap). కేవలం బాలీవుడ్ లోనే కాదు.. తమిళ్ మలయాళ, మరాఠి ఇండస్ట్రీ చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటారు అనురాగ్.
సినిమాలు, రాజకీయాలు ఇలా ప్రతీ విషయంలో కామెంట్స్ చేస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా ఉంటారు. ఆలాంటి ఆయన తాజాగా మరో సంచలన పోస్ట్ చేశారు. ఇక నుండి ఆయన ఎవరిని ఫ్రీగా కలవరట. తనని కలవాలంటే గంటకి ఐదు లక్షలు సిద్ధం చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో భాగంగా ఆయన.. ఇతరులకు సహాయం చేయడంలో నేను చాలా సమయాన్ని కోల్పోయాను. అవన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయాయి. అందుకే.. ఇకనుండి ఎవరిని పడితే వాళ్ళని ఫ్రీగా కలవాలనుకోవడం లేదు. నన్ను కలవాలంటే గంటకి ఐదు లక్షలు ఛార్జ్ చేస్తాను. అది భరించే ధైర్యం ఉంటేనే నన్ను కలవండి. ముందు అడ్వాన్స్ ఇవ్వాలి.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం అనురాగ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మీ సినిమాలే అనుకున్నాం.. మీరు కూడా చాలా తేడాగా ఉన్నారు కదా. ఫిక్స్ రేటా కాస్త డిస్కౌంట్ ఇవ్వొచ్చుగా సార్. మిమ్మల్ని కలవడానికి వస్తున్న మధ్యలో మీరు ఇలాంటి పోస్టులు పెడితే ఎలా.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలా కలవడానికి కూడా లక్షల్లో ఛార్జ్ చేయడంపై మీ ఒపీనియన్ ని కామెంట్స్ చేయండి.