మూసాపేట, వెలుగు : మనీ డ్రా చేసేందుకు వచ్చిన వ్యక్తి ఏటీఎం మెషీన్నుంచి రూ.5 లక్షలు చోరీ చేసిన ఘటన కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ రోడ్‌నంబర్.4లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 2.45 గంటలకు ఓ వ్యక్తి వచ్చాడు. మొదట మనీ విత్‌డ్రా చేశాడు. తర్వాత ఫేక్కార్డ్ తో ఏటీఎంలోని రూ.5 లక్షలు దోచుకెళ్లాడు.
ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఏటీఎంలలో నగదు జమ చేసే యువకుడే ఈ చోరీకి పాల్పడ్డాడని, అతడిని బాలానగర్ సీసీఎస్పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.