
న్యూఢిల్లీ: అగ్రి చట్టాలు, లఖింపూర్ ఖేరీ ఘటన సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. తాజాగా ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేవలం బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణతో ఐదు లక్షల ఉద్యోగులు బలవంతంగా పదవీ విరమణ చేయాల్సి వస్తుంది. దీంతో వారు నిరుద్యోగులుగా మారతారు. లక్షలాది కుటుంబాల ఆశలు గల్లంతవుతాయి. ఇక వారి కలలు కల్లలే అయిపోతాయి. ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు ఎప్పుడూ ఆర్థిక అసమానతలను సృష్టించవు. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించవు’ అని వరుణ్ ట్వీట్ చేశారు.
केवल बैंक और रेलवे का निजीकरण ही 5 लाख कर्मचारियों को ‘जबरन सेवानिवृत्त’ यानि बेरोजगार कर देगा।
— Varun Gandhi (@varungandhi80) February 22, 2022
समाप्त होती हर नौकरी के साथ ही समाप्त हो जाती है लाखों परिवारों की उम्मीदें।
सामाजिक स्तर पर आर्थिक असमानता पैदा कर एक ‘लोक कल्याणकारी सरकार’ पूंजीवाद को बढ़ावा कभी नहीं दे सकती।
మరిన్ని వార్తల కోసం: