కేరళలోని అలప్పుజాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలార్ కోడ్ దగ్గరలో ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో గాయపడిన వారిని వందనమ్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు తరలించి..చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంలో గాయపడిన విద్యార్థులంతా వందనమ్ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. కారు ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.