- యజమానిపై కేసు నమోదు
ఘట్ కేసర్, వెలుగు: మండి బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురి కావడంతో హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో ఈ ఘటన జరిగింది. సీఐ సైదులు వివరాల ప్రకారం.. రాంపల్లికి చెందిన కోలోజు నరసింహ చారి కుటుంబ సభ్యుల శుక్రవారం సాయంత్రం భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయానికి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో రాత్రి 10 గంటలకు ఘట్ కేసర్ పట్టణంలోని అరేబియా హోటల్ వెళ్లికి ఐదుగురు మండి తిన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత వీరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు చెప్పడంతో.. బాధితులు ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.