బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష

బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష

16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో మరో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది.

ఈ ఘటన జనవరి 29, 2021న జరిగింది. కోర్బా జిల్లాలోని గధుప్రోడా గ్రామ సమీపంలో తండ్రితో కలిసి వెళ్తోన్న 16 ఏళ్ల బాలికపై అరుగులు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. టీనేజ్ బాలికపై అత్యాచారం చేసి, రాళ్లతో కొట్టి చంపారు. ఆపై సదరు బాలిక తండ్రిని, వారితో పాటు ఉన్న మరో నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశారు. అనంతరం వీరి మృతదేహాలను సమీప అడవిలో పడేశారు. 

ఈ ఘటనలో అరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టు ముందు నిల్చోబెట్టగా ఇన్నాళ్లకు తీర్పొచ్చింది. సంత్రమ్ మజ్వార్ (49), అబ్దుల్ జబ్బార్ (34), అనిల్ సర్థి (24), పరదేశి రామ్ (39), ఆనంద్ పనికా (29)లకు మరణశిక్ష విధిస్తు అదనపు సెషన్స్ జడ్జి మమతా భోజ్వానీ తీర్పిచ్చారు. మరో నిందితుడు ఉమాశంకర్ యాదవ్ (26)కి జీవిత ఖైదు విధించారు.

తీర్పిచ్చే వెలువరించే సమయంలో న్యాయమూర్తి.. ఈ ఘటనను అమానవీయమైన, క్రూరమైన చర్యగా చెప్పుకొచ్చారు. నిందితులు తమ కామాన్ని తీర్చుకోవడానికి ముగ్గురు అమాయకులను పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందని న్యాయమూర్తి అన్నారు.