ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బ్యాక్‌తో పాటు పలు బ్యాంకులు సేవింగ్స్ ఖాతా చార్జీలు, క్రెడిట్ కార్డుల నిబంధనల్లో మార్పులు చేశాయి. ఆయా మార్పులు బుధవారం(మే 1) నుంచి అమలులోకి వచ్చాయి.మే నెలలో ఫైనాన్షియల్ అప్‌డేట్స్‌ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల కీలక మార్పులు చేసింది. బ్యాంకు కొన్ని రకాల సేవలకు ఛార్జీలను సవరించింది. ATM వినియోగం, డెబిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లు, IMPS, స్టాప్ పేమెంట్, సిగ్నేచర్ అటెస్టేషన్ లతో పాటు మరికొన్ని ఇతర సేవలకు ఛార్జీలను పెంచింది. ఈ ఛార్జీలు బుధవారం నుంచే అమలులోకి రానున్నాయి. డెబిట్ కార్డులపై ఇకనుంచి నగర ప్రాంతాల్లో రూ. 200లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99ల వార్షిక ఫీజును వసూలు చేయనుంది. చెక్ బుక్స్ విషయానికి వస్తే మొదటి 25 చెక్ లీఫ్ లు ఉచితం.. ఆ తర్వాత ఒక్కో లీఫ్ కు రూ. 4 ల చొప్పున వసూలు చేయనున్నారు. అయితే ట్రాన్సాక్షన్ క్యాప్ రూ. 25వేలు.
నగదు లావాదేవీలపై నెలకు 3 ఉచిత నగదు లావాదేవీలు జరపొచ్చు. ఆ తర్వాత ఒక్కో లావాదేవీకి రూ. 150 చొప్పున వసూలు చేస్తారు.డెబిట్ కార్డు పోయినా , పాడైపోయిన సందర్భంలో రీప్లేస్ మెంట్ కార్డు కోసం కస్టమర్ రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు ప్రైవేట్ బ్యాంకు యెస్ బ్యాంకు తన పొదుపు ఖాతా ఛార్జీల ను అప్‌డేట్‌చేసింది. బ్యాంక్ కొన్ని ఖాతా రకాలను కూడా నిలిపివేసింది. క్రెడిట్ కార్డ్ యుటిలిటీ ట్రాన్సాక్షన్ ఫీజులో నూ మార్పులుచేసింది.ఈ ఛార్జీలు మే 1 నుంచి అమలులో ఉంటాయని ఎస్ బ్యాంకు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సేవింగ్స్ ఖాతా కనీస నగదు బ్యాలెన్స్ అవసరాలను సవరించింది ఎస్ బ్యాంకు. సేవింగ్స్ / కిసాన్ సేవింగ్స్ అకౌంట్ లకోసం రూ. 5000 లు కనీస బ్యాలెన్స్ ఉంచాలి. గరిష్ట ఛార్జీ రూ. 500. YES సేవింగ్స్ అకౌంట్ ప్రో ప్లస్, యెస్ ఎసెన్స్ SA , YES రెస్పెక్ట్ SAకి గరిష్టంగా రూ. 750 ఛార్జీతో రూ. 25,000 నగదు బ్యాలెన్స్ ఉంచాలి. సేవింగ్స్ ఖాతా PRO రూ. 10,000 AMBని తప్పనిసరి చేసింది. గరిష్ట ఛార్జీ రూ.750.
మరోవైపు యెస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అన్ని యుటిలిటీ బిల్లు చెల్లింపులపై 1శాతం సర్‌చార్జి రుసుమును చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.