నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్లు గ్రామంలో 5 నెలల చిన్నారి చైన్ లాకెట్ మింగింది. దీంతో పాప తల్లిదండ్రులు నల్గొండ RK గ్యాస్ట్రో & ఛెస్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పాపకు స్కానింగ్ ద్వారా డాక్టర్లు లాకెట్ ని గుర్తించారు. ఆ తర్వాత ఎలాంటి సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా లాకెట్ ని బయటకు తీశారు డాక్టర్ కీర్తి రెడ్డి.
అరుదయిన శాస్త్ర చికిత్సగా చెబుతున్నారు డాక్టర్లు. చిన్నారి తల్లిదండ్రులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.