కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన మాజీ మంత్రులు

ఇప్పటికే పంజాబ్ లో అధికారం కొల్పోయిన కాంగ్రెస్ కు ఇప్పుడు వరుస షాక్ లు తగులుతున్నాయి. సునీల్ జాఖ‌డ్ ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీని వీడగా, మరో ఐదుగురు కీలకమైన నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పంజాబ్ మాజీ మంత్రులు గురుప్రీత్ సింగ్ కంగ‌ర్‌, బ‌ల్బీర్ సింగ్ సంధూ, రాజ్ కుమార్ వెర్కా, సుంద‌ర్ శ్యామ్ అరోరా, మాజీ ఎమ్మెల్యే కేవ‌ల్ సింగ్ ధిల్లాన్ కాంగ్రెస్ ను వీడి శ‌నివారం బీజేపీలో చేరారు. చండీగఢ్‌లోని పార్టీ కార్యాలయంలో వీరంతా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

మొహాలీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బల్బీర్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా పనిచేయగా, రాంపుర ఫుల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుర్‌ప్రీత్ కంగర్ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఇక మజా ప్రాంతానికి చెందిన వెర్కా గత ప్రభుత్వంలో సామాజిక న్యాయ, మైనారిటీల మంత్రిగా ఉన్నారు.  

హోషియార్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సుందర్ శామ్ అరోరా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా ఈ ఎడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నలుగురు నేతలు ఓడిపోయారు. అటు కాంగ్రెస్‌ పార్టీకి ఇలాంటి కీలకమైన నేతలు ఉద్వాసన పలకడం ఆ పార్టీ అగ్ర నాయ‌క‌త్వానికి ఆందోళ‌న క‌లిగిస్తోంది.

మరిన్ని వార్తల కోసం .. 

సెస్ కేటాయింపులో తెలంగాణకు అన్యాయం