ఏ చిన్న రోగం వచ్చినా అందరూ చేసే పని ఓ యాంటీబయాటిక్ టాబ్లెట్ వేసుకోవటం. రోగానికి సపరేట్ గా మందు ఉన్నప్పటికీ యాంటీబయాటిక్ తో కలిపి వాడటం అందరికీ అలవాటు. యాంటీ బయాటిక్ టాబ్లెట్స్ మంచివే అయినా.. మరీ ఎక్కువగా వాడితే శరీరమంతా వాటితోనే నిండిపోతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావటం ఖాయం. అందుకే న్యాచురల్ గా దొరికే యాంటీబయాటిక్స్ వాడితే సమస్య వచ్చిన ప్రతిసారి టాబ్లెట్స్ అవసరం ఉండదు.
ఆరోగ్యానికి సంబంధించి ఒక మంచి కొటేషన్ ఉంది.. మీ ఆహారమే మీ ఔషధం.. మీ ఔషధమే మీ ఆహారం అని. అంటే.. తినే తిండి ఆరోగ్యానికి ఔషధంలా పనిచేయాలి తప్ప, ఆర్టిఫీషియల్ మందుల మీద ఎక్కువ ఆధారపడకూడదు. శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించటానికి యాంటీ బయాటిక్స్ వాడతారు. అయితే.. మరీ ఎక్కువగా యాంటీ బయాటిక్స్ తీసుకోవటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, శరీరం యాంటీ బయాటిక్స్ కి అలవాటు పడిపోతుంది. వీటిని వాడినన్ని రోజులు శరీరం బ్యాక్టీరియాను సమర్థవంతంగా ఎదుర్కొని వాడటం ఆపగానే.. పనితీరు మందగిస్తుంది. అందుకే ఇమ్యూనిటీ తగ్గకుండా యాంటీ బయాటిక్స్ గా పనిచేసే కొన్ని హోమ్ రెమిడీస్ ఉన్నాయి.. అవి ఏంటంటే:
కొత్తిమీర:
కొత్తిమీరతో చాలా విటమిన్స్, ఫైటో న్యూట్రిఎంట్స్ ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీంతో పాటు వీటిలోని యాంటిబయాటిక్ లక్షణాలు వైరస్ ను అటాక్ చేస్తాయి. అందుకే అనారోగ్యంగా ఉన్నప్పుడు కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. కొత్తిమీరను జ్యూస్ లాగా తీసుకువచ్చు లేదా.. కొత్తిమీర ధనియాలు కలిపి టీ కూడా చేసుకోవచ్చు.
వెల్లుల్లి:
వెల్లుల్లిలో ఉండే లాభాలు అన్ని ఇన్ని కావు, ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు బ్యాక్టీరియాను తరిమికొట్టి అనారోగ్యాన్ని దూరం చేస్తాయి. అందుకే వెల్లుల్లిని రోజూ తినే వంటకాల్లో భాగం చేసుకోవాలి.. లేదా ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బల్ని నమలడం మంచిది.
పసుపు:
పసుపు న్యాచురల్ యాంటిబయాటిక్ అని అందరికి తెలిసిందే. అందుకే గాయాలు అయినప్పుడు పసుపు రాస్తుంటారు. పసుపు ఆయుర్వేదిక్ మందులలో తయారీలో వాడతారు. ఇందులో ఉండే యాంటిబయాటిక్ లక్షణాలు శరీరాన్ని బ్యాక్టీరియా నుండి కాపాడటంలో కీరోల్ పోషిస్తాయి. అలాగే పసుపులో కుర్యుమిన్ అనే పదార్థం చాలా రకాల అనారోగ్యాల నుండి రక్షిస్తుంది. అందుకే.. పసుపును వంటల్లో తప్పనిసరిగా వాడాలి. దీంతో పాటు రోజూ పసుపు, తేనే మిశ్రమాన్ని తీసుకోవడం కూడా మంచిదే.
అల్లం:
బ్యాక్టీరియాను ఎఫెక్టివ్ గా ఎదుర్కోవడంలో అల్లం ముందుంటుంది. అల్లంలో ఉండే యాంటీబ్యాక్టీరియాటిక్ గుణాలు బ్యాక్టీరియా వల్ల కలిగే చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడతాయి. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లను తగ్గించటానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే రోజువారీ ఆహారంలో అల్లాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతో పాటు రోజు అల్లం టీ తాగటం కూడా మంచిదే.
క్యాబేజీ:
క్యాబేజీ కూడా న్యాచురల్ యాంటిబయాటిక్ గా పనిచేస్తుంది. ఇందులోని సల్ఫర్ కాంపౌండ్స్ క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆ వ్యాధి ముప్పును తప్పించడానికి ప్రయత్నిస్తాయి. క్యాబేజీలో విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ తో కూడా చాలా ఎఫెక్టివ్ గా పోరాడతాయి.
తులసి:
తులసిలో ఎన్నో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఈ గుణాలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆకులను ఊరికే తిన్నా, ఆవిరి పట్టినా వాసనా చూసినా టీ చేసుకొని తాగినా.. ఏ రూపంలో తీసుకున్నా ఇది పనిచేస్తుంది. తులసిలో యాంటీబయాటిక్, ఫంగల్ గుణాలు రోగాన్ని పెంచే బ్యాక్టీరియాను చంపుతాయి. వైరల్ ఫీవర్ కు కూడా ఇది బాగా పనిచేస్తుంది.
ఈ న్యాచురల్ యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ గా లభించేవి కాబట్టి న్యాచురల్ ఢిఫెండర్స్ గా పనిచేస్తాయి. పైగా పూర్తిగా సేఫ్. ఇమ్యూనిటీని పెంచి, రకరకాల ఇన్ఫెక్షన్స్ ను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి.