వేదాంత నుంచి 5 కొత్త కంపెనీలు.. డీమెర్జర్‌‌‌‌కు ఓకే చెప్పిన కంపెనీ బోర్డు

వేదాంత నుంచి 5 కొత్త కంపెనీలు.. డీమెర్జర్‌‌‌‌కు ఓకే చెప్పిన కంపెనీ బోర్డు
  • ఒక వేదాంత లిమిటెడ్‌ షేరుకి 5  కంపెనీల నుంచి ఒక్కో షేరు

న్యూఢిల్లీ: మైనింగ్ నుంచి ఆయిల్ వరకు వివిధ సెక్టార్లలో ఉన్న వేదాంత  తన బిజినెస్‌‌లను సపరేట్‌‌ చేస్తోంది. ఇప్పటి వరకు కలిసి ఉన్న బిజినెస్‌‌లను ఇండిపెండెంట్ కంపెనీలుగా మార్చనుంది. ఈ బిజినెస్‌‌ల వాల్యూని పెంచేందుకే డీమెర్జర్‌‌‌‌ నిర్ణయాన్ని తీసుకున్నామని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. వేదాంత లిమిటెడ్‌‌ నుంచి ఐదు ఇండిపెండెంట్ కంపెనీలు డీమెర్జ్ కానున్నాయి.

 ఒక వేదాంత లిమిటెడ్ షేరు ఉన్న షేరు హోల్డర్‌‌‌‌కు  ఐదు కంపెనీలకు చెందిన ఒక్కో షేరుని ఇస్తారు. ఈ ఐదు కంపెనీలు కూడా మార్కెట్‌‌లో లిస్ట్‌‌ అవుతాయి. దీంతో  మొత్తం ఆరు కంపెనీలు ట్రేడవుతాయి. వేదాంత లిమిటెడ్ శుక్రవారం 7 శాతం పెరిగి రూ.223 వద్ద సెటిలయ్యింది. ‘మా బిజినెస్‌‌ యూనిట్‌‌లను డీమెర్జ్‌‌ చేయడం ద్వారా వీటి వాల్యూ మరింత పెరుగుతుంది. ప్రతీ బిజినెస్‌‌ సెగ్మెంట్‌‌ వేగంగా వృద్ధి చెందడానికి వీలుంటుంది. 

మా అన్ని బిజినెస్‌‌లు నేచురల్ రిసోర్సెస్‌‌  సెక్టార్ కిందకు వస్తాయి. అయినప్పటికీ ప్రతీ బిజినెస్‌‌కు సపరేట్ మార్కెట్ ఉంది. డిమాండ్, సప్లయ్ ట్రెండ్స్ ఉన్నాయి. టెక్నాలజీ మెరుగుపరిచి వీటి ప్రొడక్టివిటీ పెంచొచ్చు’ అని వేదాంత చైర్మన్‌‌  అనిల్ అగర్వాల్‌‌  పేర్కొన్నారు. వేదాంత లిమిటెడ్‌‌ నుంచి  వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్‌‌, వేదాంత పవర్, వేదాంత స్టీల్‌‌ అండ్ ఫెర్రోస్‌‌ మెటల్స్‌‌,  వేదాంత బేస్‌‌ మెటల్స్‌‌ కంపెనీలు వేరుకానున్నాయి. 

హిందుస్తాన్ జింక్ కూడా  తన జింక్‌‌, లెడ్‌‌, సిల్వర్‌‌‌‌, రీసైక్లింగ్‌‌ బిజినెస్‌‌లను డీమెర్జర్ చేస్తామని ప్రకటించింది. ఈ బిజినెస్‌‌ల వాల్యూని మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఈ కంపెనీలో వేదాంత లిమిటెడ్‌‌కు మెజార్టీ వాటా ఉంది.