
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో 5 హామీలు అమలయ్యాయని.. రైతుబంధు కూడా పూర్తింయిదని చెప్పారు మంత్రి కొండా సురేఖ. నర్సాపూర్ లో రేపు జరగబోయే కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభా స్థలాన్ని మంత్రి కొండా సురేఖ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని.. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిధులు రాలేదని చెప్పారు. మెదక్ లో ప్రతి చిన్న కార్యకర్త నుండి పెద్ద స్థాయి నాయకులు అహర్నిశలు కష్టపడి ఎంపీ అభ్యర్థి నీలం మధును లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ బహిరంగ సభను 50 వేల మందితో విజయవంతం చేయాలన్నారు. మెదక్ ప్రాంతానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిందేమీ లేదని విమర్శించారు.