ఈ మధ్యకాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలు కారణంగా ఇతరులు బలౌతున్నారు. తాజాగా చేతబడి చేస్తున్నారనే కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 5మందిని గ్రామస్తులు దారుణంగా కొట్టి చంపిన ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పూర్తీ వివరాల్లోకి వెళితే స్థానికి రాష్ట్రంలోని సుక్మా జిల్లాకి చెందిన కోయిలిబేడ గ్రామంలో మౌసం కన్నా అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా కోయిలిబేడ గ్రామంలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడటం, అనుమానాస్పద సంఘటనలు జరగటం వంటివి చోటు చేసుకుంటున్నాయి. దీంతో వీటన్నింటికి మౌసం కన్నా కుటుంబ సభ్యులు చేతబడి చెయ్యడమే కారణమని గ్రామస్థులు ఏకంగా మోసం కన్నా మరియు అతడి భార్య, కొడుకు, కోడలు మరియు మరో కుటుంబ సభ్యురాలిపై దారుణంగా రాళ్లతో మరియు కర్రలతో దాడి చేశారు.
అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే భాదితులు మరణించారు. దీంతో కొందరు స్థానికులను అదుపులోకి తీసుకుని పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.