రాత్రిపూట నిద్రపోయినప్పటికీ మెలకువతో కష్టపడుతున్నారా? ఇది మీ నిద్రను ప్రభావితం చేసే బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు. నిద్ర లేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ రోజువారీ జీవితాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేయవచ్చు. మీరు రాత్రి మొత్తం నిద్ర పోయినా విశ్రాంతి లేదని తెలిపే ఐదు సంకేతాలు మీకోసం..
నిత్యం అలసట
మీకు ప్రతిసారీ నిద్రపోవాలని అనిపిస్తుందా? నిరంతరం అలసట బాధిస్తుందా.. నిద్ర లేమికి ఇది ఒక క్లాసిక్ సంకేతం. మీరు మీటింగ్ లలో ఆవలిస్తున్నట్లు లేదా చదువుతున్నప్పుడు మీ కళ్ళు తెరిచి ఉంచడానికి కష్టపడుతున్నట్లు అనిపిస్తే మీ శరీరానికి అవసరమైన విశ్రాంతి లభించడం లేదని ఇది స్పష్టమైన సూచన.
చిరాకు, మానసిక కల్లోలం
మీ తరుచుగా చిరాకు, మనసంతా ఏదో కలవరం పడినట్లు అనిపిస్తుందా.. ? మూడీగా ఉంటున్నారా? ఏ పని చేయాలని లేదా? అయితే నిద్రలేకపోవడం కారణం కావచ్చు.. నిద్రలేమి అనేది మీ భావోద్వేగాలను నియంత్రణపై ప్రభావం చూపొచ్చు. ఇది మిమ్మల్ని చిరాకుగా, ఆకస్మిక మూడ్ స్వింగ్ లకు గురి చేస్తుంది. మీరు మిమ్మల్ని కూల్ గా ఉంచుకోవడం కష్టంగా అనిపించినా అది నిద్రలేమి కారణం అని గమనించండి.
ఏకాగ్రత కష్టం
నిద్రలేమితో కాన్సంట్రేట్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఒక పనిపై మనస్సు నిలబడదు..పనులపై దృష్టి పెంటేందుకు ఇబ్బందిగా ఉంటుంది. నిద్రలేమి మీ మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. సమాచారాన్ని ఏకాగ్రతను , ప్రాసెస్ చేయడం కష్టతరం చేస్తుంది. మీరు మాట్లాడుతున్న సమయంలో జోన్ అవుట్ అవుతున్నట్టు లేదా పని , స్కూల్, కాలేజీలో తరుచుగా తప్పులు చేస్తుంటే నిద్ర లేకపోవడమే.. ఇది మీ మానసిక స్పష్టతను ప్రభావితం చేస్తుంది.
నిద్ర లేకపోతే శారీరక మార్పులు
నిద్ర లేకపోతే తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక నిద్ర లేమి శారీరంగా చాలా ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి, కండరాలలో ఉద్రిక్తత, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు ఉన్నాయంటే అది నిద్రలేమితోనే అని గమనించారు. మీ రు అలసటతో పాటు ఈ ఫిజికల్ సంకేతాలు గమనిస్తే నిద్ర సమస్యలు న్నట్లు నిర్ధారించుకొని పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి.
పెరిగిన ఆకలి, బరువు పెరుగుట
మిమ్మల్ని మీరు ఎక్కువ స్నాక్స్‌లు తీసుకోవాలనుకుంటున్నారా లేదా బరువు పెరిగి ఇబ్బంది పడుతున్నారా? నిద్ర లేమి ఆకలిని నియంత్రించే హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది.ఇది ఆకలి పెరగడానికి , అనారోగ్యకరమైన తినే విధానాలకు దారితీస్తుంది. మీరు సాధారణం కంటే ఎక్కువగా తింటుంటే లేదా మీ బరువులో మార్పులను గమనిస్తే, నాణ్యమైన నిద్ర లేకపోవడమే. ఇది మీ ఆకలిని ప్రభావితం చేయవచ్చు.