జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం 300 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని బనోయికి ఆర్మీ వాహనం వెళ్తుండగా ఘరోవా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
ప్రయాణ సమయంలో బస్సులో 18 మంది సైనికులు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. ఘటనా స్థలానికి వచ్చిన జమ్మూ కశ్మీర్ పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.