-Community-Science-Course_YKkGa3NXRl.jpg)
బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్స్ ఒక విభిన్నమైన కోర్సు. చదివేది నాలుగేండ్ల డిగ్రీ కానీ, అందుకునేది మాత్రం ఐదు స్పెషలైజేషన్ సర్టిఫికెట్స్. ఈ కోర్సు రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హోం సైన్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా పీజేటీఎస్ఏయూ హోం సైన్స్ కళాశాలను ఏర్పాటు చేశారు. మొదట్లో అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో నాలుగేండ్ల బీఎస్సీ(హానర్స్) హోంసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కోర్సును ప్రస్తుతం బీఎస్సీ(హానర్స్) కమ్యూనిటీ సైన్స్‌గా మార్చారు.
గత విద్యా సంవత్సరం వరకు ఇంటర్మీడియట్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌లో ప్రవేశాలు కల్పించే వారు. కోర్సుకు డిమాండ్ పెరగడంతో ఎస్ఎస్సీతోపాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, విదేశాల్లో విద్యనభ్యసించిన వారు సైతం ప్రవేశాల కోసం రావడం పెరిగింది. గ్రేడింగ్ సమస్యలు తలెత్తి సీట్ల కేటాయింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను అధిగమించడం కోసం గత విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్ ద్వారా బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డిప్లొమా అభ్యర్థులకు మినహాయింపు ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంపీసీ లేదా బైపీసీ ఏ కోర్సు చదివినా బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ చదవడానికి అర్హులు. గతంలో మహిళా అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించేవారు. గత ఏడాది నుంచి పురుష అభ్యర్థులకు సైతం ప్రవేశాలు కల్పిస్తూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. పదో తరగతి తర్వాత డిప్లొమా (హోంసైన్స్) చదివిన అభ్యర్థులు ఎంసెట్ రాయాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేండ్ల కోర్సులో భాగంగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హ్యుమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, అపెరల్ డిజైన్ అండ్ టెక్స్ టైల్స్, రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్సెస్, ఎక్సెటెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్లో సమగ్రమైన శిక్షణ అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి ఐదు విభాగాల్లోనూ స్పెషలైజేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు.
ఉద్యోగావకాశాలు
బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌లో అందుకున్న ఐదు స్పెషలైజేషన్లలోనూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నత విద్యపై ఆసక్తి లేనివారు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించవచ్చు. స్పెషలైజేషన్ వారీగా ఏయే సంస్థల్లో ఉద్యోగ/ ఉపాధి అవకాశాలు ఉన్నాయనే వివరాలు కింది విధంగా ఉన్నాయి.
హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్
చైల్డ్ డెవలప్మెంట్ అసోసియేట్స్, ఫ్యామిలీ కౌన్సిలర్స్, ప్రీస్కూల్ టీచర్స్, అకాడమిక్ మేనేజర్స్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్
ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ రూరల్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్, ఎన్జీవోల్లో ఎక్సెటెన్షన్ ఆఫీసర్స్, స్కూళ్లు, హాస్పిటళ్లలో పీఆర్ఓ, ప్రొడక్షన్ అసిస్టెంట్, వుమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తదితర ఉద్యోగాలు.
అపెరల్ అండ్ టెక్స్టైల్స్
రిటైల్ హౌసెస్‌లో వ్యాపార నిర్వహణ, విజువల్ డిస్ప్లే మేనేజర్స్, డిజైనర్స్, టెక్స్టైల్స్ డిజైనర్స్, రీసెర్స్ అసిస్టెంట్స్, వొకేషనల్ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్, గార్మెంట్స్ యూనిట్లలో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, ఫ్లోర్ సూపర్వైజర్.
రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్
రెసిడెన్షియల్, కమర్షియల్ డెకొరేట్లో డిజైనర్ అసిస్టెంట్, ఫ్లవర్ అరేంజర్స్, డెకొరేటర్స్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఫైనాన్స్ మేనేజ్మెంట్, హౌస్ హోల్డ్ టైమ్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైనర్స్.
అడ్మిషన్లు ఇలా..
రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్‌లో మాత్రమే బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అందుబాటులో ఉంది. మొత్తం 75 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంసెట్ ద్వారా 67 సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన ఎనిమిది సీట్లను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా భర్తీ అవుతాయి. హోంసైన్స్‌లో డిప్లొమా పూర్తి చేసిన వారి కోసం అదనంగా 10 సీట్లు ఉంటాయి. గత ఏడాది నుంచి పేమెంట్ సీట్లనూ ప్రవేశ పెట్టారు.
ఐదు స్పెషలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవే..
- ఫుడ్ అండ్ న్యూట్రిషన్
- హ్యుమన్ డెవలప్మెంట్
- అండ్ ఫ్యామిలీ స్టడీస్
- అపెరల్ డిజైన్ అండ్ టెక్స్ టైల్స్
- రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్సెస్
- ఎక్సెటెన్షన్ ఎడ్యుకేషన్ అండ్
- కమ్యూనికేషన్ మేనేజ్మెంట్