మహబూబాబాద్ జిల్లాలో పులి కోసం వేట కొనసాగుతోంది. కొత్తగూడ , గంగారం అడవుల్లో పులి ఆచూకీ కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. కొత్తగుడ మండలంలోని కోనాపూరం అటవీ ప్రాంతం లో పులి సంచరిస్తుందని వారం రోజుల నుంచి గిరిజన గ్రామాలు భయంతో జంకుతున్నాయి. పులి అడుగులను గుర్తించారు కొత్తగూడ ఎఫ్ఆర్ఓ వజాహత్.దీంతో అడవిలో మరిన్ని సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.
చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలటూ ఆటవీశాఖ ఆధికారులు ప్రచారం చేయించారు. వారం రోజుల వరకు పొలాల దగ్గరకు వెళ్లొద్దని సూచించారు. పశువుల కాపర్లు కూడా ఆడవి లోకి వెళ్లొద్దని చెప్పారు. పులి ఆచూకీ కోసం 5 బృందాలు గాలిస్తున్నామని.. ఫారెస్టులో కిలోమీటర్ లోపు ఒక్క, ఒక్క సీ సీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. పులి తిరిగిన కోనాపూరం ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు జిల్లా డిఎఫ్ఓ విశాల్