![తమిళనాడులో పెళ్లి జంటలకు వాన కష్టాలు](https://static.v6velugu.com/uploads/2022/11/5-weddings-scheduled-to-take-place-at-Anjineyar-Temple-in-Pulianthop_gbUcxziuYw.jpg)
తమిళనాడులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలో నీట మునిగాయి. చెన్నైలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. పులియంతో ప్రాంతంలోని ఆంజనేయస్వామి ఆలయంలో జరగాల్సిన ఐదు పెళ్లిళ్లు ఆలస్యం అయ్యాయి. పెళ్లివేడుకల కోసం ఆలయం ముందు బంధువులు బారులుతీరారు. వర్షాలకు ఆలయంలోకి భారీగా వరదనీరు వచ్చాయి. దీంతో వివాహ వేడుకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
పెళ్లి చేసుకునే జంటలు వర్షంలో తడుస్తూ... వరదనీటిలోనే ఆలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. చెన్నైలోని తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.