విమానాలు షురూ.. ఢిల్లీ నుంచి బెంగుళూరు జర్నీ చేసిన 5 ఏళ్ల చిన్నోడు

చిన్నపిల్లలను బస్సులో పంపేందుకే  చాలామంది తల్లిదండ్రులు భయపడుతుంటారు. అలాంటిది ఓ అయిదేళ్ల బుడతడు ఒక్కడే ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో ప్రయాణించాడు. బెంగుళూరుకు చెందిన విహాన్ శర్మ లాక్డౌన్‌కు ముందు ఢిల్లీ వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు. అయితే సోమవారం నుంచి విమాన రాకపోకలు మొదలుకావడంతో.. విహాన్ ఢిల్లీలో ఈ ఉదయం ఫ్లైట్ ఎక్కి.. బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్ పోర్టులో దిగాడు. విహాన్ విమానం దిగేసరికి అతని తల్లి.. విహాన్ కోసం ఎదురుచూస్తు ఉంది.

లాక్డౌన్‌కు ముందు ఢిల్లీ వెళ్లిన తన కొడుకు.. ఫ్లైట్స్ ప్రారంభం కావడంతో మొదటిరోజే రప్పించుకున్నామని విహాన్ తల్లి తెలిపింది. తమకు తెలిసినవారు ఢిల్లీలో విహాన్‌ను ఫ్లైట్ ఎక్కించారని.. బెంగళూరులో దిగానే తాను రిసీవ్ చేసుకున్నానని ఆమె తెలిపింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చేవరకు తాను ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నానని ఆమె తెలిపింది. స్పెషల్ కేటగిరిలో విహాన్ వచ్చాడని ఆమె తెలిపింది.

వయసులో చిన్నవాడైన విహాన్.. కరోనా విషయంలో మాత్రం చాలా పెద్దగా ఆలోచించాడు. అందుకే  కరోనా జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్తగా  ప్లైట్ జర్నీ చేశాడు. ముఖానికి  మాస్క్, హ్యాండ్స్‌కు  గ్లోవ్స్ వేసుకొని అందరినీ తనవైపుకు ఆకర్షించాడు.

For More News..

విషాహారం తిని కుటుంబం ఆత్మహత్య

మాస్క్​ అవసరం కాదు.. అలవాటైపోయింది

64 మందితో 24గంటల సర్జరీ