ఇన్‌‌స్పైర్ ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల స్టూడెంట్స్ ఎంపిక

ఇన్‌‌స్పైర్ ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల స్టూడెంట్స్ ఎంపిక

హైదరాబాద్, వెలుగు: ఇన్‌‌స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ స్టూడెంట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు అభినందించారు. 

ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 50 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఇన్‌‌స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక కావడం అభినందనీయమని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ తెలివితేటలతో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని, వారి ప్రతిభను గుర్తించి ఇన్ స్పైర్ లాంటి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని టీచర్లకు మంత్రి సూచించారు.